యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. దేవర నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక రీసెంట్‌గా ముంబైలో ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటికే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ఓవర్‌సీస్‌లో ప్రీ సేల్స్‌లో కూడా ఈ మూవీ సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ దేవర నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలిపారు. ఆదివారం (సెప్టెంబర్ 22) రోజున గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న చిత్రం కావడం, అందునా పాన్ ఇండియా లెవెల్లో దీనిని రిలీజ్ చేస్తుండటంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో తారక్ అభిమానులు భారీగా హాజరయ్యే అవకాశాలున్నాయి.
దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె దేవర చిత్రాన్ని నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























