యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సీనియర్ హీరోయిన్ అభిరామి ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 13న భలే ఉన్నాడే సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్ట్రెస్ అభిరామి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
వెరీ బిగినింగ్ నుంచి ఇప్పటివరకూ మీ జర్నీ గురించి చెప్పాలంటే?
- రెండు పదాలలో చెప్పాలంటే.. హ్యాపీ యాక్సిడెంట్ (నవ్వుతూ). నేను ఏదీ ప్లాన్ చేసి రాలేదు. ఎలాంటి సినీ నేపధ్యం లేదు.
- అమ్మ నాన్న బ్యాంక్ ఉద్యోగులు. మిడిల్ క్లాస్ అమ్మాయిని. టీవీలో యాంకర్ గా చేశాను. తర్వాత ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి.
- కొన్ని సినిమాలు చేశాను. తర్వాత యుఎస్ వెళ్లి చదువుకున్నాను. పెళ్లి చేసుకొని అక్కడే కొన్నాళ్ళు సెటిల్ అయ్యాను.
- తిరిగిరావడంలో కూడా ప్లాన్ లేదు. ఇదొక వండర్ ఫుల్ జర్నీ. నచ్చిన వృత్తిలో వున్నాను. నేను చాలా లక్కీ.
‘భలే ఉన్నాడే’ మూవీలోకి ఎలా వచ్చారు?
- మారుతి గారు కాల్ చేసిన ఈ సినిమా, క్యారెక్టర్ గురించి చెప్పారు.
- తర్వాత డైరెక్టర్ శివసాయి వర్ధన్ కథ, క్యారెక్టర్ చెప్పినపుడు చాలా నచ్చింది.
- ఇమ్మిడియట్గా చేయాలని డిసైడ్ అయ్యాను.
మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?
- ఇందులో నా క్యారెక్టర్ పేరు గౌరీ. తను బ్యాంక్ ఎంప్లాయ్. అమ్మ,నాన్న బ్యాంక్ ఉద్యోగులే కావడంతో ఇది నాకు పర్శనల్‌గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్.
- సింగిల్ మదర్, స్ట్రాంగ్ ప్రిన్సిపల్ వున్న విమెన్ క్యారెక్టర్ నాది. డైరెక్టర్ గారు మదర్‌తో పాటు ఒక సిస్టర్లా కనిపించేలా క్యారెక్టర్ని తీర్చిదిద్దారు.
- గౌరీ స్ట్రాంగ్ విమెన్. తనలో సీరియస్‌నెస్‌తో పాటు హ్యుమర్, ఎమోషన్ వుంటుంది. సినిమా త్రూ అవుట్ నా క్యారెక్టర్ వుంటుంది.
- మదర్- సన్ రిలేషన్షిప్ సినిమాకి సోల్‌గా వుంటుంది. ఈ సినిమాకి నా క్యారెక్టర్ ఎమోషనల్ యాంకర్లా వుంటుంది.
- అలాగే ఈ సినిమాలో సింగీతం గారు, లీలా గారి పాత్రల మధ్య నడిచే కథ కూడా బ్యూటీఫుల్‌గా వుంటుంది,
డైరెక్టర్ శివసాయి వర్ధన్ గురించి?
- శివసాయి వర్ధన్ ఫస్ట్ టైం డైరెక్టర్లా అనిపించలేదు. తనకు చాలా క్లారిటీ వుంది, క్లియర్ విజన్‌తో వుంటారు.
- సినిమాకి ఎంతకావాలో ఏమి కావాలో తెలుసు. చాలా ఫ్లెక్సిబుల్‌గా వుంటారు. సినిమాకి యూజ్ అయ్యే ఏదైనా సజెషన్ ఇస్తే తీసుకుంటారు.
మూవీ ప్రొడ్యూసర్స్ గురించి?
- నిర్మాతలు చాలా కంఫర్ట్‌బుల్‌గా చూసుకున్నారు. వారితో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్.
- మారుతిగారు గ్రేట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్. తనకి ఎలాంటి కథని ఎంచుకోవాలో అన్నీ తెలుసు.
యాక్టింగ్ విషయంలో రాజ్ తరుణ్‌కి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా?
- రాజ్ తరుణ్ గుడ్ యాక్టర్. సజెషన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు.
- ఇందులో తనది శారీ డ్రాపర్ క్యారెక్టర్. శారీని ఎలా టై చేస్తారో కొంచెం గైడ్ చేశాను.
మీ రీఎంట్రీలో మహారాజ, సరిపోదా శనివారం లాంటి సూపర్ హిట్స్ చేశారు. ‘భలే ఉన్నాడే’లో మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి?
- నిజానికి నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే. తర్వాత మహారాజ, సరిపోదా శనివారం వచ్చాయి.
- అయితే అనుకోకుండా ఆ రెండు ముందుగా రిలీజ్ అయ్యాయి. నేను ఎప్పుడూ కథనే చూస్తాను.
- మహారాజ, సరిపోదా శనివారం ఎలా అయితే కథ నచ్చి చేశానో.. ‘భలే ఉన్నాడే’ చేయడానికి కారణం కూడా కథే.
- నాకు కథ, క్యారెక్టర్ నచ్చితే మరో ఆలోచన లేకుండా చేస్తాను.
‘చెప్పవే చిరుగాలి’ తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం?
- నేను ఆ సినిమా సమయంలోనే డిగ్రీ చేయడానికి యుఎస్ వెళ్లాను. ఆ సినిమాని చాలా రోజుల తర్వాత చూశాను.
- సినిమా చాలా మంచి విజయం సాధించింది. తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి.
- నేను యుఎస్‌లో వుండిపోవడం వలన చేయడం కుదరలేదు.
మీ రీఎంట్రీ ఎలా జరిగింది?
- పదేళ్ళ క్రితం తమిళ్లో నా రీఎంట్రీ జరిగింది. కమల్ హాసన్ గారి ‘విశ్వరూపం’ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పడానికి యూఎస్ నుంచి వచ్చాను.
- అప్పటినుంచి చాలా మంది క్యారెక్టర్స్ కోసం అప్రోచ్ అయ్యారు. అయితే నేను మాత్రం సెలక్టివ్‌గా చేస్తున్నాను.
- గత రెండేళ్ళలో పది సినిమాలు చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వున్నాను.
కొత్తగా చేస్తున్న సినిమాలు ఏవి?
- రెండు తెలుగు కథలు విన్నాను. తర్వాతలోనే వాటి గురించి చెప్తాను.
- ఇంట్రస్టింగ్ రోల్స్ చేయాలని వుంది. తమిళ్లో లీడ్ రోల్లో రెండు సినిమాలు చేస్తున్నాను.
- కమల్ హసన్, మణిరత్నం గారి సినిమాలో ఇటివలే నా పోర్షన్ పూర్తి చేశాను. ఇంకొన్ని ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ వున్నాయి.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























