గేమ్ ఛేంజర్.. ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తోంది ఎవరంటే?

Game Changer Overseas Distribution Rights Acquired by Phars Film

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా చరణ్‌తో ఆమెకు ఇది రెండవ సినిమా. అంతకుముందు ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆయనతో కలిసి నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘జరగండి’ సహా టోటల్ ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ నెలలోనే సెకండ్ సింగిల్ రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది.

గేమ్ ఛేంజర్ సినిమాను ఓవర్సీస్‌లో రిలీజ్ చేసేందుకు ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. ఈ మూవీ ఎంటైర్ ఓవర్సీస్‌ రిలీజ్ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సొంతం చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కంగువ’ చిత్రం ఓవర్సీస్‌ రైట్స్‌ను కూడా ఈ సంస్థే దక్కించుకుంది.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మెసేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.