కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

మా నాన్న సూపర్ హీరో.. టీజర్ వచ్చేస్తోంది

Maa Nanna Superhero Teaser Launch Event Venue and Date Fixed

మా నాన్న సూపర్ హీరో.. టీజర్ వచ్చేస్తోంది

Maa Nanna Superhero Teaser Launch Event Venue and Date Fixed

Maa Nanna Superhero Teaser Launch Event Venue and Date Fixed

నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్‌ హీరో'. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

'మా నాన్న సూపర్‌ హీరో' మూవీ ప్రేమ, అనుబంధానికి నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్‌ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామాగా తెరకెక్కుతోంది. టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచిన ఈ యూనిక్ ఎమోషనల్ సాగాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. గురువారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం 4గంటల నుంచి RK సినీప్లెక్స్ లోని స్క్రీన్ నెంబర్ 2లో జరుగనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

కాగా తెలుగునాట కొత్త సినిమాల విడుదలకు సంక్రాంతి తర్వాత దసరా బెస్ట్ సీజన్. ఫ్యామిలీస్‌ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ వున్న 'మా నాన్న సూపర్ హీరో' రిలీజ్‌కి దసరా పర్ఫెక్ట్ టైమ్ అని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌ హీరో విడుదల కానున్నట్టు తెలిపారు. త్వరలోనే ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్‌ని రివిల్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాకి MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర కో రైటర్స్ కాగా.. రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, అనిల్ కుమార్. పి ఎడిటర్‌గా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్