రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాష్ లీడ్ రోల్స్‌లో నటించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించాడు. సీనియర్ స్టార్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్, ట్రైలర్ సాంగ్స్‌తో ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ రెజీనా కసాండ్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ఉత్సవంలో మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి?
డైరెక్టర్ అర్జున్ సాయి గారు ఈ కథ నెరేటివ్ చేసినప్పుడు వెరీ బ్యూటీఫుల్‌గా అనిపించింది. ఈ కథలో సోల్ వుంది. నాటక రంగం గురించి ఆయన చాలా రీసెర్చ్ ఈ కథని రాసుకున్నారు. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న రూటెడ్ స్టొరీ ఇది. అది నాకు చాలా నచ్చింది.
అర్జున్ సాయి సెన్సిబుల్ డైరెక్టర్. ఆడియన్స్‌ని థియేటర్స్‌కి తీసుకురావడానికి ఎలిమెంట్స్ కావాలో తెలిసిన డైరెక్టర్. చాలా అద్భుతమైన నటులు ఇందులో వున్నారు. అలాగే డీవోపీగా రసూల్ గారు, మ్యూజిక్ అనూప్ రూబెన్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?
ఇందులో నేను కార్పోరేట్ ఎంప్లాయ్‌గా కనిపిస్తాను. తనకి లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ వుండదు. చాలా ఇండిపెండెంట్. నా క్యారెక్టర్ ఇండిపెండెంట్ విమెన్ రిలేట్ చేసుకునేలా వుంటుంది. కథలో చాలా కీలకంగా వుంటుంది. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది.
మీరు చిన్నప్పడు స్టేజ్ ప్లేస్ చేసేవారా?
నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్లేస్ ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్‌లో ప్లేస్ చేశాను. ఈ సినిమాలో రంగస్థలం నటులు గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు వున్నాయి. అవన్నీ ఆడియన్స్‌ని హత్తుకునేలా వుంటాయి.
దిలీప్ ప్రకాష్ గురించి?
దిలీప్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. చాలా పాజిటివ్ సోల్. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్‌తో వుంటారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.
ఈ సినిమాలో పని చేసిన అందరూ చాలా సిన్సియర్‌గా పని చేశారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు థియేటర్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. చాలా నేర్చుకున్నాను.
మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది?
ఇది చాలా మంచి సినిమా. డైరెక్టర్ అర్జున్ సాయి తన తొలి సినిమాగా ఇలాంటి గొప్ప కథని చెప్పాలని అనుకున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ సపోర్ట్ చేయడం, వారు తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది.
షార్ట్ టైం గోల్స్ ఉన్నాయా?
నా ఫస్ట్ సినిమా ఎస్ఎంఎస్ చేసినప్పుడే వెర్సటైల్ యాక్టర్‌గా వుండాలని భావించాను. అది నా నుంచి ఎప్పుడూ దూరం కాకుండా ఇన్నాళ్లూ పాత్రలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
గోపిచంద్ మలినేని, సన్నీ డియోల్ గారి సినిమా చేస్తున్నాను. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ వున్నాయి. అవి మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























