దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్‌తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో టీం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిధిగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. “డైరెక్టర్ అర్జున్ సాయి పట్టువదలని విక్రమార్కుడు. ఎన్నో హార్డిల్స్‌ని దాటుకొని చాలా మంది నటులతో ఈ సినిమాని తీశాడు. నాటకం గురించి తనకున్న తపన అద్భుతం. అందరి నటుల నుంచి కావాల్సిన నటన రాబట్టుకున్నాడు. నిర్మాత సురేష్ ఇలాంటి గొప్ప సినిమాలు మరెన్నో తీయాలి” అని ఆకాంక్షించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా విజయోత్సవానికి మళ్ళీ మనమంతా కలుసుకోవాలి. సురభి నాటక మండలి వారికి ధన్యవాదాలు. నాటక రంగాన్ని బ్రతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో నటించాను. వారిపై ఒక సినిమా తీయాలనే ఆలోచన మామూలు విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడిని అభినందిస్తున్నాను. తను మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: