మరోసారి మంచి మనసు చాటుకున్న సాయి దుర్గతేజ్

Sai Durgha Tej Donates Promised Amount To Amma Orphanage in Vijayawada

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఆయన విజయవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలుత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత ‘అమ్మ’ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఆశ్రమానికి రూ.2 లక్షలు, ఇతర సేవా సంస్థలకు రూ.3 లక్షలు చొప్పున విరాళం అందించారు.

కాగా గతంలో 2019లో తన పుట్టినరోజు నాడు అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని మాటిచ్చారు దుర్గతేజ్. చెప్పినట్లుగానే 2021లో ఆశ్రమానికి బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. అంతేకాకుండా దాదాపు 3 సంవత్సరాల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. ఇక నేడు మరోసారి కొంత మొత్తం భూరి విరాళంగా అందజేశారు.

కాగా సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి. మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న సాయి దుర్గతేజ్ భవిష్యత్ లోనూ తనకు వీలైనంతగా సేవా కార్యక్రమాలు చేయాలని, తద్వారా సమాజానికి తనవంతుగా అండగా నిలబడాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.