పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఇతిహాసం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ పురాణపురుషుడు శ్రీరాముడిగా నటించాడు. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీనికి ప్రధానకారకుడు డైరెక్టర్ ఓం రౌత్ అంటూ విమర్శకులు సైతం ఆయనపై విరుచుకుపడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా ఓం రౌత్ ఆదిపురుష్ ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా దీనిపై స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో ముక్కు, ముఖం తెలియనివారు, ట్రోలర్స్ చేసే విమర్శల గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టిక్కెట్లు కొని, థియేటర్‌కి వెళ్లి, సినిమా చూసే వారికి మాత్రమే విమర్శించే హక్కు ఉంటుంది. వారికీ మాత్రమే మనం జవాబుదారీ” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ఆదిపురుష్ సినిమా భారతదేశంలో మొదటి రోజు 70 కోట్లు, ఓవరాల్‌గా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం ఆంధ్ర, తెలంగాణలలోనే 200 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్ నుండి సుమారు 80-90 కోట్లు వసూలు చేసింది. మీరు దేశంలో కానీ లేదా విదేశాలలో ఎక్కడికి వెళ్లినా, తెలుగు అభిమానులు మరియు తెలుగు సినీ ప్రేమికులు మీ వద్దకు వస్తారు, మీతో మాట్లాడతారు మరియు మిమ్మల్ని ఉత్తమంగా ఆదరిస్తారు” అని అన్నారు. కాగా ఓం రౌత్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























