పవన్ కళ్యాణ్‌ని కలిసిన ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల ప్రొడ్యూసర్స్

Producers DVV Danayya and AM Ratnam Meets Power Star Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే తాజాగా ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల ప్రొడ్యూసర్స్ డీవీవీ దానయ్య మరియు ఏఎం. రత్నం వేర్వేరుగా పవన్ కళ్యాణ్‌ను కలుసుకున్నారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీసుకి వెళ్లిన వారు అక్కడ పవర్ స్టార్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే పెండింగ్‍లో చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటానని ఇటీవల పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పటినుంచి షూటింగులకు అందుబాటులో ఉంటారనే విషయమై సంప్రదించేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు పవన్‌ను కలుసుకున్నారు. ఇక దగ్గరలోనే ఈ చిత్రాల షూటింగ్స్‌లో పవన్ పాల్గొననున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ సూచనప్రాయంగా వెల్లడించారు.

కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్‌ రాజ్‌, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కిక్‌ శ్యామ్‌, వెంకట్‌ బచ్చు, అజయ్‌ ఘోష్‌, మొట్ట రాజేందర్‌, జీవా, హరీష్‌ ఉత్తమన్‌, శాన్‌ కక్కర్‌, అభిమన్యు సింగ్‌, కుమనన్‌ సేతురామన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికొస్తే.. పవర్ స్టార్ ఫస్ట్ టైం ఒక వారియర్‌గా కనిపిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత ఎఎం. రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.