టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డిస్నీ యొక్క విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు ఆయన డబ్బింగ్ చెప్తుండటం విశేషం. కాగా గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ప్రీక్వెల్‌గా వస్తోంది. ఇండియాలో ఈ యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. దీనిలో భాగంగా లయన్ కింగ్ సినిమా దేశవ్యాప్తంగా అద్భుత కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో రిలీజైన సమయంలో అక్కడి ప్రముఖ నటులతో డబ్బింగ్ చెప్పించారు. దీనిలో భాగంగా నాడు తెలుగులో ముఫాసా పాత్రకు సాయి కుమార్ గాత్రం అందించగా.. కొడుకు సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పారు.
ఈ నేపథ్యంలో తెలుగులో ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. అలాగే ఆయనతోపాటు ప్రముఖ కమెడియన్స్ బ్రహ్మానందం పుంబా పాత్రకు, అలీ టిమోన్ పాత్రకు డబ్బింగ్ చెప్తున్నారు. మొదటి భాగంలో కూడా ఆయా పాత్రలకు వీరే గాత్రం అరువిచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది. ఇక ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు ముఫాసా: ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.
కాగా డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ మహేష్ బాబు తమ చిత్రంలో భాగమవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో సినిమా అనుభవాన్ని ఆస్వాదించడం మా లక్ష్యం. ముఫాసా యొక్క ఐకానిక్ క్యారెక్టర్ తరాలకు స్ఫూర్తినిచ్చింది మరియు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు గారు ముఫాసా వాయిస్‌కి జీవం పోయడం మాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయులు ఆర్యన్ ఖాన్ మరియు అబ్రమ్ ఖాన్ లతో కలిసి హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే ఈ మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్‌ను డిస్నీ విడుదల చేయగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక ఇంగ్లీష్ లో ముఫాసాకు ఆరోన్ పియర్, సింబాకు డోనాల్డ్ గ్లోవర్.. అలాగే యంగ్ ముఫాసాకు బ్రేలిన్ రాంకిన్స్ డబ్బింగ్ చెప్పారు. లైవ్-యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ మిళితం చేసి ఫోటోరియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజురీ యానిమేటెడ్ గా రూపొందిన ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు అకాడమీ అవార్డ్ విన్నర్ బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























