ఇండియాలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ క్రికెటర్లనైతే దేవుళ్ళు మాదిరి భావిస్తుంటారు ఫ్యాన్స్. అలాంటివారిలో ఒకరు టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక భూమిక పోషించాడు యువీ. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అయితే ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో ఏకంగా ఒకే ఓవర్లో 6 సిక్స్ లు బాది ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన విషయాన్ని క్రికెట్ ప్రేమికులెవరూ అంత త్వరగా మర్చిపోలేరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్నోసార్లు ఒంటిచేత్తో ఇండియాకు విజయాలు అందించిన ట్రాక్ రికార్డ్ యువరాజ్ సొంతం. ఇక ఆయనకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఇప్పటికే పలువురు క్రికెటర్ల జీవితగాథలను వెండితెరపై ఆవిష్కరించిన నేపథ్యంలో యువీ ఫ్యాన్స్ ఆయన బయోపిక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రకటన వచ్చింది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరో ప్రొడ్యూసర్ రవి భాగ్ చందక్ తో కలిసి యువరాజ్ సింగ్ బయోపిక్‌ను నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు నేడు వారు యువీ సమక్షంలో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరు? ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేవి ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
కాగా బాలీవుడ్ లో టీ సిరీస్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించింది. ప్రభాస్ హీరోగా ‘సాహో’, రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’, షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ (అర్జున్ రెడ్డి రీమేక్), అజయ్ దేవగన్ కథానాయకుడిగా ‘తానాజీ’ వంటి సినిమాల్లో టీ సిరీస్ నిర్మాణ భాగస్వామి. అలాంటి సంస్థ నుంచి ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుండటంతో అటు క్రికెట్ ప్రేమికులు, ఇటు సినిమా అభిమానులలో ఇప్పటినుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























