డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాధ్ తన విలన్‌లను పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేయడంలోస్పెషలిస్ట్. ఇప్పుడు ఆయన డబుల్ ఇస్మార్ట్‌లో మెయిన్ విలన్‌పై ఒక పాటను ఇంక్లూడ్ చేశారు. బిగ్ బుల్ క్యారెక్టర్ ని సంజయ్ దత్ పోషించారు. తాజాగా ముంబైలో ఈ బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మణిశర్మ కంపోజ్ చేసిన “బిగ్ బుల్” విజువల్, మ్యూజికల్ గా పవర్ ఫుల్ నెంబర్. హై ఎనర్జీ, పండుగ వాతావరణంలో సెట్ చేయబడిన ఈ పాట, కావ్య థాపర్ గ్లామర్ టచ్ యాడ్ చేసింది.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్తే. తెలుగు సినిమా డైనమిక్స్ ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసి, బిగ్ బుల్ గా ప్రజెంట్ చేస్తున్న పూరి సర్ కి థాంక్ యూ. ఛార్మి పరేషాన్ చేసింది (నవ్వుతూ).. తన హార్డ్ వర్క్, డెడికేషన్, ఫోకస్ వలనే ప్రోడక్ట్ అంత అద్భుతంగా వచ్చింది. కావ్య ఇందులో చాలా బ్యూటీఫుల్ గా కనిపించింది. విషు కి థాంక్ యూ” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “రామ్ నా యంగర్ బ్రదర్ లాంటి వాడు. తనతో పని చేయడం చాలా మజా వచ్చింది. డబుల్ ఇస్మార్ట్ గా మస్త్ ఉంటాడు. తనతో వర్క్ చేయడం ప్లెజర్ అండ్ హానర్. తను గుడ్ పెర్ఫార్మర్. వెరీ హార్డ్ వర్కర్. తన ఫన్ తో ఈ సినిమా చేశాం. చాలా చోట్ల తిరిగాం. చాలా మస్తీ చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్ యూ’ అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























