టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘VD 12’ (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో VD 12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్స్ అందించింది. మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ మరియు రిలీజ్ డేట్‌లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ నెలలోనే సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు తెలిపింది. అలాగే వచ్చే యేడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు మేకర్స్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు. అందులో విజయ్ రగ్గడ్ లుక్‌లో వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. లైట్ హెయిర్‌తో, మాసిన గడ్డంతో, ముఖంపై గాయాలతో ఉన్నాడు. వర్షం కురుస్తుండగా.. పైకి చూస్తూ భరించలేని బాధతో బిగ్గరగా అరుస్తుండటం గమనించొచ్చు. దీనిని చూస్తుంటే విజయ్ ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నట్టు అర్ధమవుతోంది.
కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న VD 12 ఇటీవలే శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాలో ఈ సీన్స్ హైలైట్ అవ్వనున్నాయట. ప్రస్తుతం కొంచెం బ్రేక్ తీసుకొని కేరళ, గోవాలలో నెక్స్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్స్‌తో సినిమా దాదాపుగా కంప్లీట్ అయ్యినట్లే.
ఇక ఈ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోం బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్యాంగ్‍స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో నటించనున్న హీరోయిన్ అలాగే ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























