సరిపోదా శనివారం నుంచి.. నాని పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్ రిలీజ్

Natural Star Nani Action Packed Poster Released From Saripodhaa Sanivaaram

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‍లో జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా రిలీజైన ‘నాట్ ఏ టీజర్’ వీడియోకి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరో నాని పవర్ ప్యాక్డ్ లుక్‌లో ఆదరగొట్టారు. రగ్గడ్‌ లుక్‌లో చేతిలో వెపన్ పట్టుకుని పవర్ ఫుల్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. మూవీలో హైఆక్టేవ్ యాక్షన్ వుండబోతోందని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది.

ఇక ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు.. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. మురళి జి సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.