ట్రెండింగ్ లో తుఫాన్ స్నీక్ పీక్

vijay antony toofan movie sneak peek top trending in social media

తమిళ్ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని హీరోగా వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ఆగష్ట్ 2వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరుస అప్ డేట్లు ఇచ్చి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. అంతేకాదు టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అయి సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉన్నా తాజాగా మరో అప్ డేట్ తో వచ్చేశారు చిత్రబృందం. తాజాగా తుఫాన్ నుండి స్నీన్ పీక్ ను రిలీజ్ చేశారు. తుఫాన్ సినిమా స్నీక్ పీక్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ ఓ హోటల్ నిర్వహిస్తున్న యువకుడిని, అతని మదర్ ను డాలీ అనే వ్యక్తి గురించి, మాల్ లో జరిగిన సంఘటన గురించి ఇంటరాగేట్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ తో పాటు పదుల సంఖ్యలో విలన్స్ ఆ హోటల్ కు వస్తారు. వీళ్లంతా తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి వారి ఎదుటే నిలబడతాడు. పోలీస్ ఆఫీసర్ ముందే ఆ విలన్స్ తో ఫైట్ చేస్తాడు హీరో. స్నీక్ పీక్ లోని ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ కానుంది. ఇక ఈ స్నీక్ పీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.

కాగా ఈసినిమాలో ఇంకా మేఘా ఆకాష్‌, మురళీశర్మ, పృథ్వీ అంబర్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం అచ్చు రాజమణి, విజయ్‌ ఆంటోని అందిస్తుండగా.. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.