ఆ కోరిక ఈ సినిమాతో తీరింది – తాన్వీ ఆకాంక్ష

Usha Parinayam Heroine Tanvi Akaanksha Thanks Director Vijaya Bhaskar

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ‘ఉషా ప‌రిణ‌యం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌ పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తాజాగా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరోయిన్‌ త్వాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ.. “సాయి దుర్గ తేజ్‌ అన్న రావడం చాలా సంతోషంగా వుంది. నేను సక్సెస్‌ అవుతుంటే ఆనందపడే వ్యక్తుల్లో సాయి అన్న ఒకరు. అన్న అంటే నాకు చాలా గౌరవం. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పడు నాన్న మొదట సాయి అన్నకే చెప్పాడు. మీరు చాలా సంతోషపడ్డారని తెలిసింది. విజయ్‌భాస్కర్‌ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్‌ యూ. సినీ పరిశ్రమలోకి రావాలన్న నా కోరిక ఈ సినిమాతో తీరింది” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “సినిమా పట్ల ఆయన ఎంతో అంకితభావం వున్న వ్యక్తి. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అందరూ నువ్వు చాలా లక్కీ అన్నారు. కమల్‌తో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంది. కమల్‌లో మంచి నటుడు, డ్యాన్సర్‌ వున్నాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అందరూ చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికి ఎంతో థ్యాంక్స్‌. కాస్ట్యూమ్‌ ఈ రోజు అంత అందంగా వున్నయాంటే దానికి కారణం శామ్‌ అక్క. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని, నాకు నటిగా మంచి గుర్తింపు ఇస్తుందనే నమ్మకం వుంది” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.