థగ్ లైఫ్ లోకి నాజర్, అభిరామి ఎంట్రీ

nasser and abhirami joins in kamal thug life movie

రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ప్రస్తుతం తను థగ్ లైఫ్ అనే సినిమా బిజీగా ఉన్నాడు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన కమల్ హాసన్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రబృందం. దానికి తోడు ఈసినిమాలో కూడా డిఫరెంట్ లుక్ తో కనిపించడంతో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముగించుకుంటూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా నుండి వరుస అప్ డేట్లను ఇస్తున్నారు. రీసెంట్ గానే కమల్ హాసన్ తన డబ్బింగ్ ను స్టార్ట్ చేసినట్టు అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు. ఈ సినిమాలోకి విల‌క్ష‌ణ నటుడు నాజ‌ర్, న‌టి అభిరామి కూడా జాయిన్ అయినట్టు తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కూడా నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.