మాస్ మహారాజ రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్‌కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘సితార్’, సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్’ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ రెండు పాటల్లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి.
అలాగే ఇటీవలే విడుదలైన టీజర్‌కి విశేష స్పందన వస్తోంది. ఇదిలావుంటే, మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి తాజాగా మరో అప్‌డేట్ అందింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సినిమాలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. అయితే తన క్యారెక్టర్‌కు అమె సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. దీంతో భాగ్యశ్రీ డెడికేషన్, ప్రొఫెషనలిజంను అందరూ ప్రశంసిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























