రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా శివం భజే. అప్సర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన పాటలకి, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా రీసెంట్ గా నే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ట్రైలర్ లో చూపించినట్టుగా ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని అర్థమైంది.
ఇక ఈసినిమా నైజాం హక్కులను టాలీవుడ్ లోని టాప్ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. ఆ ప్రొడక్షన్ మరేదో కాదు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. శివం భజే నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకొని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈసినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసీ, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయ సుల్తానా తదితరులు నటిస్తున్నారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. వికాస్ బడిస సంగీతం.. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































