విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్

vishwak sen mechanic rocky first glimpse out now

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మెకానిక్ రాకీ సినిమా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చోటే చోటే బచ్చో కో పూరోంకి మై జవాబ్ దేదూ అంటూ మొదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా డేంజర్ కే లైసెన్స్అ నే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ విశ్వక్ సేన్ డైనమిక్ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తున్నాయి. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను ప్రజెంట్ చేస్తూ.. సినిమాలోని కీలక పాత్రలను రివిల్ చేసేలా ఫస్ట్ గేర్ డిజైన్ చేశారు. ఈ గ్లింప్స్ ఎట్రాక్టివ్ ఎంటర్ టైన్మెంట్, డైనమిక్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది. మరోసారి విశ్వక్ సేన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నట్టు అర్థమవుతుంది. సునీల్ ఈసినిమాలో కూడా డిఫరెంట్ పాత్రతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకా మీనాక్షి చౌదరి, శ్రద్ద శ్రీనాథ్ లను చూపించారు.

కాగా ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి ఈసినిమాను నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో సునీల్, నరేష్, రోడీస్ రఘురాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనోజ్ కటసాని సినిమాటోగ్రాఫర్ గా.. అన్వర్ అలీ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈసినిమా ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ దక్కించుకొని సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.