తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనందరికీ ఎంతో ఇష్టమైన నాయకుడని, ప్రతి ఒక్కరికీ ఆయన పేవరెట్ లీడర్ అని పేర్కొన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ మాజీ సీఎంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల మణిశర్మ కంపోజ్ చేసిన ఒక పాటలో సీఎం కేసీఆర్ పాపులర్ డైలాగ్ వాడటంపై వివాదం నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కరోనా కాలంలో సీఎం కేసీఆర్ విలేఖరుల సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ యథాలాపంగా ‘ఏం జేద్దాం అంటావ్ మరి’ అన్న మాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అనేక మీమ్స్‌లో ఈ డైలాగ్ ఉపయోగించడం కూడా తెలిసిన విషయమే. తాజాగా ఈ డైలాగ్‍ను ఒక అప్‌కమింగ్ మూవీలో మేకర్స్ వాడారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘మార్ ముంతా చోడ్ చింతా’ అనే సాంగ్ మధ్యలో దీనిని పెట్టడం వివాదాస్పదమైంది.
దీనిపై కొందరు నెటిజెన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం స్థాయి వ్యక్తిని కించపరిచారు అని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఈ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ.. “సీఎం కేసీఆర్ అంటే మనందరికీ ఎంతో ఇష్టం. ఆయన చాలా గొప్ప నాయకుడు. నాతో సహా చాలామంది ఆయనకు వెరీ హార్డ్ కొర్ ఫ్యాన్స్. మనం ఆయన ఫాలోయర్స్” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “వాస్తవానికి మార్ ముంతా చోడ్ చింతా’ సినిమాలో ఐటెం సాంగ్ కాదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్. కేసీఆర్ చాలా సీరియస్ అంశాన్ని కూడా సరదాగా చెప్పగలరు. ఆ మాటను ఇప్పటికే ఎన్నో మీమ్స్‌లో చూశాం. కేవలం ఎంటర్ టైనింగ్ కోసమే ఇలా చేశాం. ఎవరిని నొప్పించడానికి కాదు. నా 27 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎవరినీ నొప్పించింది లేదు. కాబట్టి మీరు కూడా దీనిని ఎంజాయ్ చేయండి” అని అన్నారు.
“దీనిని వివాదం చేయాల్సిన పనిలేదు. పాట మధ్యలో ఆయనను ఒకసారి తల్చుకున్నాం అని అనుకోవచ్చు. దయచేసి ఎవరూ హర్ట్ అవ్వొద్దు. ఒకవేళ ఎవరైనా బాధపడివుంటే మమ్మల్ని మన్నించండి” అని కోరారు మణిశర్మ. కాగా ఆయనతోపాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, గీత రచయిత కాసర్ల శ్యామ్ కూడా ఈ ఇంటర్వ్యూలో ఆయనతో పాటు పాల్గొన్నారు. వారు కూడా ఈ అంశాన్ని వివాదం చేయొద్దని, సీఎం కేసీఆర్ అంటే తామందరికీ ఎంతో గౌరవం అని తెలిపారు.
కాగా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























