కల్కి.. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki 2898 AD Total Box Office Collection Up to Day 27

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్‌ అందుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే 1,000 కోట్ల క్లబ్‍లోకి ఎంటరైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా కల్కి 2898 AD మరో రికార్డ్ అందుకుంది. గ్లోబల్ వైడ్‌గా ఈ విజువల్ వండర్ రూ.1100 క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు రూ.1100 క్లబ్‌లోకి ఎంటర్ అయినట్టయింది. అంతకుముందు ‘బాహుబలి 2’ సినిమా రూ..1,500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి గుర్తుండేవుంటుంది. అయితే కల్కి విడుదలై దాదాపు నెల కావొస్తున్నా.. ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ భారీ కలెక్షన్లతో దుమ్ము రేపుతుండటం విశేషం.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.