బాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నారా రోహిత్. ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించాడు. అయితే కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. రీసెంట్ గానే ప్రతినిథి2 సినిమాతో వచ్చాడు. ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాతో వస్తున్నాడు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సుందరకాండ. రోహిత్ కెరీర్ వస్తున్న 20వ సినిమా ఇది. ఈ ఫన్ ఫిల్డ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు నారా రోహిత్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నారా రోహిత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కూల్ లుక్ లో ఉన్న రోహిత్ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది. రోహిత్ ఇన్నోసెంట్ లుక్స్‌లో కూల్ డ్రెస్‌లో క్లాసీ, ఛార్మింగ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. అంతేకాదు టీజర్ ను కూడా త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు.
కాగా ఈసినిమాలో నారా రోహిత్ సరసన విర్తి వాఘని హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































