నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్‌గా తన 50 మైల్ స్టోన్ మూవీ ‘రాయన్’కి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో సందీప్ కిషన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే మీరు కొన్ని తమిళ సినిమాలు చేశారు కదా.. కానీ రాయన్ గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు.. కారణం?
తమిళ్‌లో నాకు నచ్చిన కథలు, ఇంట్రస్టింగ్ ఫిల్మ్ మేకర్స్‌తో పని చేశాను. ధనుష్ అన్నతో కెప్టన్ మిల్లర్, ఇప్పుడు రాయన్ బిగ్గర్ సెటప్ వున్న కాంబో ఫిలిమ్స్. ఇందులో నా కాంట్రిబ్యుషన్ చాలా గ్రేట్‍గా వుంటుంది. ఇలాంటి క్యారెక్టర్ చాలా రేర్. ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్‌గా నిలిస్తుంది.
ఇందులో మీ పాత్ర ఏమిటి?
అసలు చెప్పకూడదు (నవ్వుతూ). అది స్క్రీన్ పైనే చూడాలి. నా క్యారెక్టర్‌కి వున్న వెయిటేజీ గురించి చెప్పాలంటే- ధనుష్ అన్న తన కోసం రాసుకున్న క్యారెక్టర్‌ని నాకు ఇచ్చారు. ఇదే ఒక బెస్ట్ కాంప్లీమెంట్‍గా భావించాను. ఇప్పటివరకూ నేను చేయని క్యారెక్టర్. నా పెర్ఫార్మెన్స్‌కి చాలా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను.
క్యారెక్టర్ ఎంటర్‌టైనింగ్‍గా వుంటుంది. ఎమోషనల్ యాంగిల్స్ కూడా చాలా ఎక్కువ వుంటాయి. యాక్షన్ కూడా వుంటుంది. క్యారెక్టర్ సీరియస్‌గా వుంటుంది చూసినపుడు ఫన్నీగా అనిపిస్తుంది. చాలా ఎక్సయిటింగ్‍గా ఎదురుచూస్తున్నాను.
ట్రైలర్ చూస్తే అంతా ఫ్యామిలీలా వుంది. కథ ఎలా వుంటుంది?
కథ గురించి ఇప్పుడు ఏ మాత్రం చెప్పకూడదండీ. ఇన్ఫాక్ట్.. ధనుష్ పెద్దన్న, నేను రెండో వాడిని, మూడో వాడు కాళిదాస్, ఒక చెల్లి. ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించే కథ. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంటుంది, ప్రతి క్యారెక్టర్‌కి ఐడెంటిటీ వుంటుంది.
రాయన్ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? ధనుష్ గారి డైరెక్షన్‍లో యాక్ట్ చేయడం ఎలా ఫీలయ్యారు?
తీయడానికి చాలా టఫ్ ఫిల్మ్ ఇది. తొంబై రోజులు షూటింగ్, నేను 75 రోజులు చేశా. నాకొక టఫ్ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్. యాక్షన్ సీన్‍లో షోల్డర్ ఇంజురీ కూడా అయ్యింది. గ్రీజ్ పూసుకుని సెట్‍కి వెళ్ళేవాడిని.(నవ్వుతూ). దాదాపు ఇరవై కిలోమీటర్ల సెట్‍లో వేరే వేరే లోకేషన్స్‌లో షూటింగ్ జరిగేది. ఇది చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్, ధనుష్ అన్న కూడా డైరెక్టర్‌గా వెరీ టఫ్.
కృష్ణవంశీ, దేవాకట్టా, రాజ్ డీకే లతో ఎలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఫీలయ్యానో రాయన్ కూడా అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. యాక్టర్‌గా నేర్చుకోవడానికి చాలా స్కోప్ దొరికింది. నేను కానీ, అపర్ణ కానీ ఇందులో ఎవరైనా ధనుష్ అన్న విజన్‍కి తగ్గట్టుగా పని చేశాం. ధనుష్ గారి డైరెక్షన్ చేయడం అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
రాయన్ టైటిల్ పెట్టడానికి కారణం?
ఇందులో మా ఇంటి పేరు రాయన్. తెలుగు సౌండింగ్ ఉండేలా ఏదైనా టైటిల్ వుంటే బావుంటుదా అని ధనుష్ గారిని అడిగాను. ఇది నార్త్ మద్రాస్‍లో జరిగే అంథంటిక్ స్టొరీ. అంథంసిటీ మారిస్తే మ్యాచ్ చేయలేం. నార్త్ మద్రాస్‍లో జరిగిన కథని తెలుగు డబ్బింగ్‍లో చూడటమే బావుంటుందని అన్నారు. కేజీఎఫ్, తిరు సినిమాలు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో రాయన్‍ని కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా సర్‌ప్రైజింగ్‍గా వుంటుంది.
పీటర్ హెయిన్స్ మాస్టర్‌తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్?
నా సినిమాల్లో ఫైట్స్ రా గా చేయడానికి ఇష్టపడతాను. ఈ సినిమాలో ఫైట్స్ చాలా యూనిక్‌గా వుంటాయి. ప్రతి ఫైట్‍కి ఒక స్టొరీ వుంటుంది. పీటర్ మాస్టర్ అద్భుతంగా చేశారు.
రెహ్మాన్ గారితో పని చేసే అవకాశం రావడం ఎలా అనిపించింది ?
చాలా ఆనందంగా వుంది. నాకు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్‌కి ఫేవరేట్ సాంగ్ అవుతుంది. అలాగే పీచు మిటాయి, ఓ రాయన్ సాంగ్ కూడా నాకు చాలా నచ్చాయి.
మీరు కీ రోల్స్ లో తమిళ్‌లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉందా?
లేదండీ. ఇది కూడా చేసేవాడిని కాదు. ధనుష్ అన్న డైరెక్షన్, ఆయన యాభైవ సినిమా. కథ విన్నాక షాక్ అయ్యాను. చాలా నచ్చింది. అందుకే చేశాను.
సన్ పిక్చర్స్ మేకర్స్ గురించి?
సన్ పిక్చర్స్ గ్రేట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్. వారితో కలసి పని చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
ధనుష్ గారి సినిమాల్లో రిమేక్ చేయాలని అనుకుంటే ఏ సినిమాలు చేస్తారు?
పుదుపేట్టై. రఘువరుణ్ బీటెక్ రిమేక్ చేయడానికి ప్రయత్నించాం, కానీ చివరి నిమిషంలో కుదరలేదు.
ధనుష్, సెల్వరాఘవన్ బాండింగ్ ఎలా వుంటుంది?
చాలా క్యూట్‍గా వుంటారు. సెల్వరాఘవన్ గారికి కూడా ముఫ్ఫై టేకులు తీసుకుంటారు (నవ్వుతూ). చాలా స్వీట్ పీపుల్. సినిమా విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా వుంటారు.
మీ బ్యానర్‌లో కొత్త సినిమాలు గురించి?
వెంకటాద్రి టాకీస్‌లో మూడు సినిమాలు చేశాం, మూడు సినిమాలు వర్కవుట్ అయ్యాయి. మంచి పేరు వచ్చింది. బయట వాళ్ళతో సినిమాలు నిర్మించాలనే బ్యానర్ పెట్టాను. తర్వలోనే కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్‌మెంట్ వుంటుంది.
భైరవ కోనకి సీక్వెల్ ఉంటుందా?
భైరవకోనకి వచ్చిన రెస్పాన్స్, సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సీక్వెల్ తప్పకుండా చేస్తాం.
కొత్త సినిమాల గురించి?
నక్కిన త్రినాధ రావు గారితో ఒక సినిమా జరుగుతోంది. ఇది నా 30వ సినిమా. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అలాగే మయావన్ సినిమా కూడా జరుగుతోంది. ఇది సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో టైప్ సినిమా. అలాగే రాహుల్, స్వరూప్‌తో వైబ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఎక్సయిటింగ్‍గా వుంటుంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























