ఈ ఏడాది లాల్ సలామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తలైవా రజినీకాంత్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తను పలు సినిమాలో బిజీగా ఉన్నాడు. వాటిలో ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ముగించుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రజినీ కూలీ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో రజనీకాంత్ ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్.
ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీలో విలన్ పాత్రకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విలన్ పాత్రలో టాలీవుడ్ అగ్ర హీరో అయిన నాగార్జున నటించబోతున్నట్టు వార్తలు అయితే ఊపందుకున్నాయి. దీంతో నాగార్జున పేరు తెరపైకి రావడంతో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































