సినిమాలకు లీకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో ఒక రకంగా లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకు కూడా లీకుల బెడదలు తప్పలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా 12 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలోని ఆయన లుక్ ఒకటి లీక్ అయింది. ఈ స్టిల్ ప్రస్తుతం ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నది. దీంతో వెంటనే చిత్రయూనిట్ తమ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. డియర్ రౌడీ ఫ్యాన్స్.. మీకు అద్భుతమైన థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మా టీమ్ ఎంతో శ్రమిస్తున్నది. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుగుతున్నది. 60శాతం షూటింగ్ పూర్తయింది కూడా. త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల చేస్తాం. ఆ ఫొటో షేర్ చేయొద్దు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాక అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. మరి ఈసినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందా? లేదా? విజయ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అన్న విషయం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























