శివన్న 131.. బిగ్ అప్‌డేట్

Karunada Chakravarthy Shivanna To Commence Shooting For 131st Film Soon

శాండల్‌వుడ్ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ (శివన్న) అభిమానులకు బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఆయన తన 131వ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇటీవల, ప్రొడక్షన్ టీం శివన్న పుట్టినరోజున ఇంట్రడక్షన్ టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఉత్సాహపరిచింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివన్న డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించనున్నాడు. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‍కి చిత్ర యూనిట్ సిద్ధమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్ 131వ సినిమా షూటింగ్ లోకి దిగేందుకు టీమ్ రెడీ అవుతుండగా, టీమ్ మొత్తం తాజాగా శివన్నను కలిశారు. దర్శకుడు కార్తీక్ అద్వైత్, నిర్మాతలు ఎన్.ఎస్. రెడ్డి, సుధీర్, సినిమాటోగ్రాఫర్ ఎ.జె. శెట్టి, ఎడిటర్ దీపు S. కుమార్ హ్యాట్రిక్ స్టార్‌ని అతని నాగవార నివాసంలో కలిశారు. కాగా కార్తీక్ అద్వైత్ ఈ చిత్రం ద్వారా శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు, ఇది దర్శకుడిగా అతని రెండవ చిత్రం.

ఈ చిత్రానికి వి.ఎం. ‘ఘోస్ట్’ ఫేమ్ ప్రసన్న, ‘సీతారామం’ ఫేమ్ జయకృష్ణ రచయితలుగా సహకరిస్తున్నారు. ‘విక్రమ్ వేద’, ‘ఆర్‌డిఎక్స్’, ‘కైతి’ ఫేమ్ సామ్ సి.ఎస్ సంగీతం అందించగా, ఎ.జె. శెట్టి సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. దీపు ఎస్.కుమార్ ఎడిటింగ్, రవి సంతేహక్లు ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని భువనేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.ఎన్. రెడ్డి, పి. సుధీర్ నిర్మిస్తుండగా.. రమణారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.