శివంభజే ట్రైలర్ రిలీజ్

ashwin babu shivam bhaje movie trailer out now

అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా శివం భజే. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమా మంచి బజ్ నే క్రియేట్ చేసింది. దీనికి తోడు ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈసినిమా ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇంకా ఈసినిమాలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. వికాస్‌ బడిస సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.