టీసీఏ ఆధ్వర్యంలో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో టీసీఏ ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ గారు పాల్గొని ప్రసంగించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిబ్రవరిలో సీజన్ 1 నిర్వహించాం. హీరో శ్రీకాంత్ గారు హీరో తరుణ్ గారు ముందు నుంచి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సెలబ్రిటీస్ అందరూ ఎంతో బిజీగా ఉన్నా చారిటీ కోసం వచ్చి క్రికెట్ ఆడి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను – సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ
ఇంతమంది సెలబ్రిటీస్ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. ఆలాగే ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అనేది కూడా అంత ఈజీ కాదు. అలాంటిది సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 15, 16 జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా – హీరో శ్రీకాంత్
సాయి కృష్ణ గారు ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ చారిటీ కోసం ఆర్గనైజ్ చేయడం చాలా మంచి విషయం. ఇక్కడున్న మా అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు ఆడిన ఏ చారిటీ మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం. సీజన్ 1 లో కూడా గెలిచాం. ఈ సీజన్ 2 కూడా గెలిచి ట్రోఫీ లిఫ్ట్ చేస్తాము అని కచ్చితంగా చెప్తున్నాను – హీరో తరుణ్
మాకు ఉన్న స్ట్రెస్ కి ఒక రిలీఫ్ గా ఫీల్ అయ్యేది క్రికెట్ మ్యాచ్. ఈవినింగ్ వర్క్ అయిపోయాక మేము అందరం కలుసుకునేది క్రికెట్ గ్రౌండ్ లోనే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి సీజన్ 1 ఆడి వచ్చాము. ఆస్ట్రేలియాలో మాకొచ్చిన రిసెప్షన్ చూసి ఆశ్చర్యం వేసింది. సీజన్ 1 ఎలా అయితే సక్సెస్ అయిందో సీజన్ 2 కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా – మ్యూజిక్ డైరెక్టర్ తమన్
ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడినప్పుడు ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ చారిటీ కోసం ఆడం. ఈ సీజన్ టు కూడా అదే మంచి కారణం కోసం ఆడడం మంచి విషయం. సినిమా ప్రమోషన్స్ వల్ల కొంతమంది రాలేకపోయారు. కర్టెన్ రైజర్ ఈవెంట్ కి అందరూ వస్తారు – హీరో అశ్విన్ బాబు
శ్రీకాంత్ గారు తరుణ్ చారిటీ కోసం టి సి ఏ తరఫున ఎప్పటినుంచో క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు దాంట్లో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఆర్గనైజర్ సాయి గారు సీజన్ 1 టైం లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఒక చారిటీ కోసం ఇలా క్రికెట్ మ్యాచ్ ఆడడం చాలా మంచి విషయం. సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను – హీరో సుశాంత్
ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. సాయి గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. నన్ను కూడా ఈ చారిటీ క్రికెట్ మ్యాచ్ లో భాగం చేసినందుకు తరుణ్ అన్నకు శ్రీకాంత్ అన్నకు కృతజ్ఞతలు. సీజన్ 2 కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను – హీరో ఆది సాయికుమార్
ఒక మంచి చారిటీ కోసం సాయి కృష్ణ ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ని లాంచ్ చేశారు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అయింది. ఆస్ట్రేలియాలో సీజన్ 1 కి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు అదే చారిటీ కోసం సీజన్ 2 నిర్వహిస్తున్నారు. సీజన్ 2 కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను – డైరెక్టర్ ఓంకార్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























