రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం

Global Star Ram Charan to Attend For The Indian Film Festival of Melbourne 2024

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు ఈ చిత్రంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటన పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటలో సహనటుడు జూ. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు గ్లోబల్ వైడ్‌గా సెన్సేషనే సృష్టించాయి. ఈ పాట ఒరిజినల్ బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ లిస్టులో ఎన్టీఆర్‌తో సహా రామ్ చరణ్ స్థానం సంపాదించిన సంగతి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్‌కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది నిర్వహించే ప్రతిష్టాత్మకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఐఎఫ్ఎమ్ – IFFM) వేడుకకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ గౌరవం అందుకున్న తొలి ఇండియ‌న్ హీరోగా రామ్ చరణ్ నిలిచారు. వచ్చే నెలలో జరుగనున్న ఈ కార్యక్రమానికి చరణ్ హాజరు కానున్నారు. దీంతో తమ హీరోకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు రావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

కాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అనేది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో 2010లో ప్రారంభించబడిన చలనచిత్ర ప్రదర్శన వేడుక. ఆస్ట్రేలియన్ ప్రేక్షకుల కోసం భారతీయ సినిమాలను ప్రదర్శించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ఫెస్టివల్‌లో బాలీవుడ్ చిత్రాలు సహా అన్ని భాషలలో రూపొందిన సినిమాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తుంటారు. కాగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మెల్‌బోర్న్‌లో షార్ట్ ఫిల్మ్ పోటీలు, నృత్య పోటీలు మరియు జెండా ఎగురవేత వేడుకలను నిర్వహిస్తారు.

ఇక చరణ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీలో నటిస్తున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ ఫీమేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తుండగా.. ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక దీనితర్వాత చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో క్రీడా ప్రాధాన్యమున్న చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనుండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.