విజయ్ ది గోట్- నిన్ను కన్న కనులే సాంగ్ రిలీజ్

ninnu kanna kanulae song out from the goat movie

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా తెలుగు వెర్షన్‌ రిలీజ్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్‌ వారు సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా పాటలను వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే విజిల్ పొడు, చిన్న చిన్న కంగల్ అంటూ రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా విజిల్ పొడు తెలుగు వెర్షన్ విజిల్ ఏస్కో పాటను కూడా విడుదల చేశారు. ఇప్పుడు మరో పాటతో వచ్చేశారు. చిన్న చిన్న కంగల్ తెలుగు వెర్షన్ నిన్ను కన్న కనులే పాటను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. కుటుంబ బంధాల నేపథ్యంలో వచ్చిన ఈపాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించగా.. ఎస్పీ చరణ్‌, చిత్ర ఆలపించారు.

కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.