టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి అశ్విన్ బాబు కూడా డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. అయితే వరుసగా సినిమాలు చేస్తున్నా అశ్విన్ బాబు కు సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. రాజు గారి గది సినిమా తరువాత ఆ రేంజ్ హిట్ ఇప్పటివరకూ రాలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమా శివం భజే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రం రం ఈశ్వరం అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే తాజాగా ఈపాటను రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేతుల మీదుగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. రం రం ఈశ్వరం అంటూ వచ్చిన ఈ పవర్ ఫుల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. భాస్కరుని సాయి చరణ్ ఈపాటను ఆలపించగా.. పూర్ణాచారి లిరిక్స్ అందించారు.
మరి అప్సర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. కాగా ఈసినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసీ, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయ సుల్తానా తదితరులు నటిస్తున్నారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. వికాస్ బడిస సంగీతం.. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































