బన్నీ తరువాత అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాలు చేస్తూ కెరీర్ ను కొననసాగిస్తున్నాడు. తన నుండి వచ్చిన చివరి సినిమా ఊర్వశివో..రాక్షసివో. ఆసినిమా తరువాత మరే సినిమాను ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేశారు. అయితే వరుసగా అప్ డేట్లు ఇచ్చినా కూడా ఈసినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. మరోవైపు శిరీష్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమాను ఆగష్ట్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కాగా ప్రిషా సింగ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. తమిళ నటుడు అజ్మల్, అలీ ముఖేష్ రిషీ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్ గా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























