తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఈసినిమా రాయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తోంది. ఈసినిమా ధనుష్ 50వ సినిమా కావడంతో సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది. ఈసినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లను, టీజర్ ను మూడు పాటలను కూడా రిలీజ్ చేశారు. అన్ని అప్ డేట్లూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ తో వచ్చేశారు మేకర్స్. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ధనుష్ మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు.
కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు. జులై 26వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాయన్ విడుదల కానుంది. ఏషియన్ సురేశ్ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























