టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో కల్కి కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా అమెరికాలోని ప్రతిష్టాత్మక TCL చైనీస్ థియేటర్లో సందడి చేశాడు. తాజాగా ఈ థియేటర్లో కల్కి స్పెషల్ స్క్రీనింగ్ జరుగగా, దీనికి నాగ్ అశ్విన్ హాజరయ్యాడు. మూవీ స్క్రీనింగ్ అనంతరం అభిమానులతో ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయగా ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు నాగి సమాధానమిచ్చారు.
ఈ మేరకు కల్కి చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అందులో.. “ఐకానిక్ TCL చైనీస్ థియేటర్లో మరపురాని సాయంత్రం! లాస్ ఏంజిల్స్‌లో కల్కి 2898 AD చిత్రం స్క్రీనింగ్ అనంతరం ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మరియు ఉరిమే ఉత్సాహం మధ్య దర్శకుడు నాగ్ అశ్విన్ అభిమానులను కలుసుకున్నారు” అని పేర్కొంది.
కాగా TCL చైనీస్ థియేటర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ రాష్ట్రంలో నిర్మించబడింది. ఇది అనేక ప్రైవేట్ ఈవెంట్లు మరియు మూడు అకాడమీ అవార్డుల వేడుకలతో సహా అనేక ప్రీమియర్లకు నిలయంగా ఉంది. ఉత్తర అమెరికాలో అతిపెద్ద సినిమా స్క్రీన్లలో ఒకటిగా దీనికి పేరుంది. అయితే ఈ థియేటర్ వెనుక పెద్ద హిస్టరీయే ఉంది. వాస్తవానికి దీనికి తొలుత ‘గ్రామాన్స్ చైనీస్ థియేటర్’ అని పేరు పెట్టారు.
అయితే చైనీస్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు TCL కార్పొరేషన్ 2013 జనవరిలో ఈ థియేటర్‌ను 5 మిలియన్స్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీంతో దీని పేరు ‘TCL చైనీస్ థియేటర్’గా మారింది. ఇక కొత్తగా పునర్నిర్మించిన ఈ థియేటర్లో 932 మంది కూర్చునే వీలుంది. గతేడాది ఇదే థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రదర్శించగా హౌస్ ఫుల్’ అవడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ప్రేక్షకులను కలుసుకున్నారు.
కాగా కల్కి చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























