ది గోట్ లైఫ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

The Goat Life OTT Platform and Streaming Date Confirmed

‘సలార్’ ఫేమ్, మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ‘ఆడు జీవితం’ పేరుతో విడుదలయింది. ఈ సినిమాలో అమ‌లాపాల్ కథానాయికగా న‌టించగా.. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళంలో నిర్మించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం, మూవీ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఏడాది మ‌ల‌యాళంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపించిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు చాలాకాలంగా సినీప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే థియేటర్లలో సూపర్ హిట్‌ అయిన ఈ మూవీ నాలుగు నెలలైనా ఓటీటీలో రాకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

అయితే ఇన్నాళ్లకు వారి ఎదురుచూపులకు తెరపడింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ది గోట్ లైఫ్ రిలీజ్‌ డేట్‌ని తాజాగా ప్రకటించారు. జులై 19న ఈ మూవీ స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా ప్రకటించింది. మాతృక మలయాళం సహా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. సో.. మూవీ లవర్స్ గెట్ రెడీ.

ఆడుజీవితం క‌థ ఏంటంటే..?

‘ఆడు జీవితం’ నిజ జీవిత కథ స్పూర్తితో బెన్యామిన్ రాసిన నవల ఆధారంగా రూపొందడం విశేషం. ‘ది గోట్‌డేస్’ అనే సూపర్ హిట్ న‌వ‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు బ్లెస్లీ ఈ మూవీని తెర‌కెక్కించాడు. పొట్టకూటి కోసం ఎడారి దేశం సౌదీకి వలస వెళ్లిన ఓ ఇమ్మిగ్రెంట్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. కేరళకు చెందిన నజీబ్ మొహమ్మద్ అనే వ్యక్తి మెరుగైన జీవనోపాధి కోసం న‌జీబ్ అహ్మ‌ద్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌), అత‌డి స్నేహితుడు హ‌కీం (కేఆర్ గోపాల్‌)తో కలిసి సౌదీకి వెళ‌తాడు. అక్కడ ఏజెంట్ చేసిన మోసం వల్ల ఇరువురూ గొర్రెల కాసే ప‌నికి ఒప్పుకోవాల్సి వ‌స్తుంది.

ఈ క్రమంలో ఎడారిలో ఉండటానికి, తిన‌డానికి, తాగడానికి సరైన వసతులు లేక న‌జీబ్ చాలా క‌ష్టాలు ప‌డతాడు. దీంతో య‌జ‌మానుల వేధింపులను భ‌రించ‌లేక అక్కడినుంచి త‌ప్పించుకొని పారిపోవాల‌నుకుంటారు. అయితే అక్కడ ఎన్ని కష్టాలు అనుభవించాడు? బానిస బ్రతుకు నుంచి విముక్తి చెందాడా? చివరకు అతను ఇండియాకు చేరుకోగలిగాడా? అసలు న‌జీబ్ ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? తిరిగి త‌న భార్య‌ను క‌లుసుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. విజువల్స్ పరంగా ఈ చిత్రం వీక్షకులకు సూపర్ ఫీల్ కలుగజేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.