టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా ఇటీవల యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఒక వీడియో వ్యవహారంలో సత్వర చర్యలు తీసుకున్నందుకు గానూ సాయి తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అనే యువకుడు తన స్నేహితులతో కలిసి డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ఒక వీడియోలో తండ్రి, కూతురు మధ్య వున్న అనుబంధంపై వీరు అసభ్యకర కామెంట్స్ చేయడంతో ఇది వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన హీరో సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా చిన్న పిల్లలపై ఇటువంటి వీడియోలు చేస్తోన్న ఆ యువకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సాయి తేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఉపముఖ్యమంత్రులను కోరారు. అందులో కుటుంబ విలువలకు మచ్చ తేచ్చేలా ఫన్ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్ చేస్తున్న వారిని వారిని కఠినంగా శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో సాయి తేజ్ ట్వీట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు విచారం ప్రారంభించి బెంగళూరులో తలదాచుకున్న ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వం సకాలంలో తన ట్వీట్‌కు స్పందించిన తీరుకు కృతజ్ఞతగా సాయి దుర్గ తేజ్ సీఎంను కలిసి తన అభినందనలు తెలియజేశారు. అనంతరం సాయి తేజ్ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా సాయి దుర్గ తేజ్ ఒకవైపు సినిమాలతో ప్రజలకు వినోదాన్ని అందిస్తూనే.. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటారు. దీనిలో భాగంగా గత కొన్ని రోజులక్రితం దేశ సైనికులు మరియు పోలీసులు వృత్తి నిర్వహణలో చేస్తున్న త్యాగాలను గుర్తిస్తూ వారి కుటుంబాలాకు అండగా ఆర్ధిక సహాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం తరపున చేపట్టే రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. దీంతో ఈ యువ హీరోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































