పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. తన నుండి కొత్త సినిమా రావాలంటే కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయక తప్పుదు ఫ్యాన్స్. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు నిర్మాతలు కొత్త డేట్ కోసం చూస్తున్నారు.. అలాగే సినిమాలో నాపై పవన్ కళ్యాణ్ పై వేరే వేరేగా సీన్స్ ఇప్పటి వరకు పూర్తయ్యాయి కానీ ఇంకా తమ మధ్య కాంబినేషన్ సీన్స్ ఇంకా చేయాల్సి ఉందని అవి క్రేజీ లెవెల్లో ఉంటాయని ఇమ్రాన్ తెలిపాడు.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































