న్యాచురల్ స్టార్ నాని నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇక ఈసినిమా ఆగష్ట్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఒకవైపు షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగాంగానే ఈసినిమా నుండి పాటలను రిలీజ్ చేస్కుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన గరం గరం సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ తో వచ్చారు. ఉల్లాసం అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్ . సోల్ ఫుల్ గా ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్ లీడర్ తరువాత మరోసారి నానికి జోడీగా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































