భారతీయుడు 2 తెలుగు రివ్యూ

Bharateeyudu 2 Telugu Review

నటీనటులు : కమల్ హాసన్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా
సంగీతం: అనిరుధ్ ర‌విచందర్
సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్
ఎడిటింగ్: శ్రీక‌ర ప్ర‌సాద్
దర్శకత్వం : శంక‌ర్
నిర్మాత: సుభాస్కరన్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘భార‌తీయుడు 2’.1996లో వీరి కాంబోలోనే వచ్చిన బ్లాక్ బస్టర్ ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్​గా ఇది తెరకెక్కింది.ట్రైలర్‌ సహా ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది.ఇక శంకర్ సినిమాలంటేనే ప్రేక్షకుల్లో ఓ విధమైన అంచనాలుంటాయి.దీనికితోడు కమల్ హాసన్ లాంటి నటుడు ఉన్నాడంటే.. అవి తారాస్థాయిలో ఉంటాయి.ఈ నేపథ్యంలో ఈరోజే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? లేదా? అనేది తెలుసుకుందాం.

కథ:

చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) తన స్నేహితులతో కలిసి సమాజంలో జరిగే అవినీతి,అన్యాయాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తుంటాడు. అవి చూసి విసుగు చెందిన జనాలు రోజురోజుకీ దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టేందుకు భారతీయుడు మళ్లీ రావాలని కోరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళిపోయిన సేనాపతి అలియాస్ భారతీయుడు (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. ఆ తర్వాత తన డ్యూటీ స్టార్ట్ చేసి కొంతమంది అవినీతిపరులను అంతమొందిస్తాడు. అలాగే దేశంలోని యువతను దీనిపై మోటివేట్ చేస్తాడు. అయితే సేనాపతి మాటల ప్రభావంతో చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) జీవితంలో అనూహ్య సంఘటన జరుగుతుంది. దీనంతటికీ కారణం సేనాపతే అని అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్‌ జీవితంలో ఏం జరిగింది ? ఎందుకు సామాన్య ప్రజలు భారతీయుడిపై కోపం పెంచుకున్నారు? ఇంతకీ సేనాపతి లక్ష్యం ఏమిటి ? అనేదే మిగితా కథ.

విశ్లేషణ:

సినిమా ప్రారంభంలోనే కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ముఖ్యంగా స్టార్టింగ్ 20 నిముషాలు చాలా బాగుంది.దీంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.సిద్దార్థ్,రకుల్ ప్రీత్ సింగ్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి.మధ్యలో కొంచెం స్లో అనిపించినా ఇంటర్వెల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఇక సెకండాఫ్ అంతా కమల్ హాసన్ పైనే నడుస్తుంది.ఆయన నటన, గెటప్స్ అద్భుతంగా ఉన్నాయి.మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సేనాపతి స్కిల్స్‌ను సిల్వర్ స్క్రీన్‌పై దర్శకుడు శంకర్ అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు.అలాగే ‘తాత వస్తడే’ సాంగ్‌ శంకర్‌ మార్క్‌ విజువల్స్‌తో గ్రాండ్‌గా ఉంటుంది.ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా చెప్పొచ్చు.

సూపర్ కాన్సెప్టుని శంకర్ తనదైన మార్క్ తో ప్రజెంట్ చేశాడు.భారతీయుడుతో పోల్చలేం కానీ ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది.సినిమా చివరిలో పార్ట్ 3 ట్రైలర్ ని కూడా చూపించారు.ఈ ట్రైలర్ లో కాజల్ మెరిసింది.సో పార్ట్ 3లో కాజల్ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది.ఓవరాల్ గా భారతీయుడు 2 ద్వారా మరోసారి సూపర్ మెసేజ్ ఇచ్చాడు దర్శకుడు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. కమల్ హాసన్‌ మరోసారి తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు.ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన తనదైన నటనతో వన్‌ మ్యాన్‌ ఆర్మీ షోలా నడిపించాడు. సిద్దార్థ్ కి మంచి పాత్ర దక్కింది.తన పాత్రలో సిద్దూ ఒదిగిపోయాడు.అలాగే బాబీ సింహా ఓ కీలక పాత్రలో కనిపించాడు.రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనవసరం లేదు. ఈ విషయంలో భారతీయుడు 2 కూడా ఎక్కడా నిరాశపరచలేదు.అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉన్నాయి.సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయింది.విజువల్స్ రిచ్ గా ఉన్నాయి.ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.కమల్ హాసన్ యాక్టింగ్, శంకర్ టేకింగ్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. సాలిడ్ మెసేజ్ తో వచ్చిన ఈ సినిమాను అందరూ చూడొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.