మచ్ అవైటెడ్ దేవర నుండి రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ ఫియర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అనిరుధ్ ట్యూన్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఈసాంగ్ అన్ని భాషల్లో కలిపి 10కోట్లకుపైగా వ్యూస్ ను రాబట్టుకుంది.ఫస్ట్ సాంగ్ బ్లాక్ బాస్టర్ కావడంతో సెకండ్ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక అన్నికుదిరితే వచ్చే వారంలో సెకండ్ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం.ఈవారంలో ఈ సాంగ్ రిలీజ్ గురించి క్లారిటీ రానుంది.ఇది మెలోడీ సాంగ్ గా రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ విషయానికి వస్తే నిన్నటి తో హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.వచ్చే వారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దీంతో షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లే.ఈసినిమా భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతుంది.పాన్ ఇండియా వైడ్ గా అంచనాలు ఉండడంతో ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయనున్నారు.
కొరటాల శివ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తుంది.తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధా ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.దేవర రెండు భాగాలుగా రానుండగా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























