టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూ. 700 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలయింది. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బెనిఫిట్ షోలతోనే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ రావడంతో గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే రూ.900 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన కల్కి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం దర్శకుడు నాగితో ఒక ఇంటర్వ్యూను రూపొందించింది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ యాంకర్ పాత్ర పోషించగా.. నాగి కల్కి మూవీ విశేషాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రోమోను తాజాగా చిత్ర యూనిట్ ‘పాడ్ కాస్ట్ విత్ అశ్వత్థామ’ పేరుతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్ మధ్య జరిగిన పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే ప్రసారం కానున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























