కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో వీరి కాంబో లోనే వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక జూలై 12న భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాల స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా గత కొన్నిరోజుల క్రితమే చెన్నై వేదికగా ఆడియో లాంచ్ చేశారు. ఆ తర్వాత ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో సింగపూర్‌లో ఓ ఈవెంట్ నిర్వహించారు.
ఈ క్రమంలో భారతీయుడు 2 నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఈవెంట్ డేట్ ఫిక్స్ కూడా ఖరారు చేశారు. రేపు హైదరాబాద్‌లో భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
కాగా భారతీయుడు 2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చగా, రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే ఎడిటర్‌గా ఎ.శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ బాధ్యతలు నిర్వహించారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























