తమిళనాడులో అదరగొడుతున్న కల్కి

kalki 2898 ad first week tamil nadu collections

కల్కి 2898 ఏడి ప్రభంజనం కొనసాగుతూనే వుంది.వీక్ డేస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ అదరగొడుతుంది.ముఖ్యంగా తమిళనాడు లో సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.మొదటి వారం లో ఈసినిమా 28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేసింది.ఫుల్ రన్ లో 40కోట్ల వరకు రాబట్టొచ్చు.రెండో వారంలో అక్కడ 400కుపైగా థియేటర్లలో కల్కి ప్రదర్శించబడుతుంది.ఇక కేరళ,కర్ణాటక లోకూడా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి  100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిన్న 7.50కోట్ల షేర్ ను రాబట్టుకొంది. దాంతో మొత్తం షేర్ 140కోట్లు దాటింది.నైజాంలో అయితే సలార్ లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది.నిన్నటి వరకు అక్కడ 70కోట్ల షేర్ ను రాబట్టింది.సలార్ నైజాం లో 71కోట్ల షేర్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కల్కి 8రోజుల్లో 750కోట్ల కుపైగా వసూళ్లను సొంతం చేసుకుంది.ఈవారాంతంలో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ఫుల్ రన్ లో 1000కోట్ల క్లబ్ లో చేరనుంది.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.