డార్లింగ్ ప్రమోషన్స్ లో బిజీ గా నభా

nabha natesh takes part in darling movie promotions

ప్రియదర్శి,నభా నటేష్ జంటగా నటించిన సినిమా డార్లింగ్.వై దిస్ కొలవరి అనేది ట్యాగ్ లైన్.షూటింగ్ పూర్తి చేసుకున్నఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.ఈనెల 19న థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ చేస్తుంది డార్లింగ్ టీం.ముఖ్యంగా నాభా నటేష్ అన్ని తానై ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. వరసగా రేడియో ప్రోగ్రామ్స్ అలాగే ఇంటర్వ్యూ లతో ఫుల్ బిజీ గా వుంది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈసినిమాలో అనన్య నాగళ్ళ కీలక పాత్రలో కనిపించనుంది.ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా హనుమాన్ ను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నభా నటేష్ చేతిలో స్వయంభు అనే సినిమా కూడా వుంది.నిఖిల్ హీరోగా నటిస్తున్నఈసినిమాలో నభా ఓ హీరోయిన్ గా నటిస్తుంది.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో సంయుక్త మీనన్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నాడు.వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.మరి ఈరెండు సినిమాలు నభాకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయో చూడాలి.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.