నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన రూట్ ను మార్చి విభిన్నమైన కథనలను ఎంటుకుంటూ వెళుతున్నాడు. ఇక మల్లిడి విశిష్ట దర్శకత్వంలో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఈసినిమాకు ప్రీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ ప్రీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈరోజు కళ్యాణ్‌రామ్ బర్త్ డే అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. NKR22 అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ ఇస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై తిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే వందల ఏళ్ళ ముందు పాలించిన పురాణ పురుషుడి ధర్మగాథను చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ రాసుకోచ్చారు.
కాగా ఈసినిమాకు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించట్లేదు. కొత్త దర్శకుడు అనిల్ పాడురి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో తెలియచేయనున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































