సౌత్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పేట ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ తో తన 44వ సినిమాను చేస్తున్నాడని తెలిసిందే.ఈసినిమా మొదటి షెడ్యూల్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.అండమాన్ లో ఈ షూటింగ్ జరిగింది.ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.పూజా కూడా ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొంది.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.ఇందులో సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.లవ్ లాఫ్టర్ వార్ అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈసినిమా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూర్య నటించిన మచ్ అవైటెడ్ మూవీ కంగువా రిలీజ్ కు రెడీ అవుతుంది.భారీ విఎఫ్ఎక్స్ తో రానున్న ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.శివ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.దిశా పటాని హీరోయిన్ గా నటించింది.రాక్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ , యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.సూర్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది కంగువా.అక్టోబర్ 10న విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























