ఇండియన్ 2 రన్ టైమ్ లాక్

kamal haasan indian 2 movie run time locked

విలక్షణ నటుడు కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఇండియన్ 2. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ స్వతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో పవర్‌ఫుల్ ఫెర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడుతుంది. ఫైనల్ గా జులై 12వ తేదీన ఈసినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ కు మరి కద్దిరోజులు మాత్రం ఉండటంతో.. మరోవైపు చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేశారు. పాటలకు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ఇండియన్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 180 నిమిషాలు అంటే 3 గంటల నిడివిని లాక్ చేశారు. 3 గంటలు అంటే లెంగ్తీ రన్ టైమే అని చెప్పొచ్చు. మరి ఈసినిమా మూడు గంటలు ప్రేక్షకుడిని ఏమేరకు అలరిస్తుందో చూద్దాం.

ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.