ఏఆర్ మురగదాస్,సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సికందర్.ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గానే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ముంబై లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక ఈసినిమా లో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ ను తీసుకున్నారు.ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను టాప్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది ఈద్ కు విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత కొంత కాలంగా సాలిడ్ హిట్ లేక రేస్ లో వెనకబడ్డాడు సల్మాన్ ఖాన్.అయితే ఈసారి సికందర్ తో ఎలాగైనా బ్లాక్ బాస్టర్ కొట్టాలని చూస్తున్నాడు.అటు మురగదాస్ కు కూడా ఈ సినిమా విజయం తప్పనిసరి కానుంది.మరోవైపు మురగదాస్ సికిందర్ తోపాటు తమిళం లో శివ కార్తికేయన్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























