గత ఏడాది చివర్లో భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ ను ఓ రేంజ్ లో చూపెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 700కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఇక ఇప్పుడు జపనీస్ లో విడుదలవుతుంది.రేపు జపాన్ థియేటర్లలో ఈసినిమా సందడి చేయనుంది.బాహుబలి తో ప్రభాస్ కు జపాన్ లోకూడా క్రేజ్ వచ్చింది.దాంతో సలార్ ను అక్కడ విడుదలచేస్తున్నారు.ఈ సందర్భంగా అక్కడి వారిని ప్రభాస్ ఈసినిమాను చూడమని వీడియో రిలీజ్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుంటే సలార్ 2 షూటింగ్ ఆగస్టు నుండి మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి.అయితే ప్రభాస్, రాజా సాబ్ ఫినిష్ చేయాల్సింది వుంది.అటు ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సివుంది.ఆగస్టు నుండి షూట్ స్టార్ట్ అవుతుందని ప్రకటించారు.మరి ప్రశాంత్ నీల్ ఈరెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తాడా లేదా ఎన్టీఆర్ సినిమాను ని ముందుకు తీసుకెళ్లి సలార్ 2 ను వచ్చే సంవత్సరంకు వాయిదా వేస్తాడనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏ డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.గత వారం విడుదలైన ఈసినిమా కేవలం 7రోజుల్లోనే 700కోట్లకు పైగా రాబట్టి సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.ఫుల్ రన్ లో ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























